Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీ.. నీ ఫ్రెండే వేధిస్తున్నాడు.. నీతో చెప్పుకోలేక చచ్చిపోతున్నా...

కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (09:52 IST)
కామాంధుల లైంగిక వేధింపులను భరించలేని ఓ విద్యార్థిని తనువు చాలించింది. తన తండ్రి స్నేహితుడే వేధించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ ఎస్‌ఆర్‌నగర్‌లో గూడూరు రవి అనే వ్యక్తికి ఇంటర్ చదివే గూరుడు భవాని అనే కుమార్తె ఉంది. స్థానికంగా ఉండే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
భవానీ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో రవి స్నేహితుడు అదే ప్రాంతానికి చెందిన వడ్డెపల్లి సంతోష్ ప్రేమ పేరుతో వేధించసాగాడు. పైగా, సంతోష్‌నే పెళ్లి చేసుకోవాలంటూ అతని ఇంటిపక్కన ఉండే పోరండ్ల భిక్షపతి కూడా ఒత్తిడి చేయసాగాడు. 
 
అటు సంతోష్.. ఇటు భిక్షపతి వేధింపులు భరించలేని భవానీ.. మంగళవారం రాత్రి ఇంట్లోనే తన చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 'డాడీ.. నీ ఫ్రెండే నన్ను టార్చర్‌ చేస్తున్నాడు. నీకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని సూసైడ్ నోట్‌లో రాసిపెట్టి ఈ దారుణానికి పాల్పడింది. 
 
కుమార్తె ఆత్మహత్యపై తండ్రి రవి ఫిర్యాదు మేరకు వడ్డెపల్లి సంతోష్‌, భిక్షపతిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం