Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : షాకైన వైద్యుడు!!

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (13:02 IST)
ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైనది ఐస్‌క్రీమ్. అయితే, ఓ వైద్యుడు కొనుగోలు చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపిచింది. దీన్ని చూసిన ఆ వైద్యుడు తేరుకోలేని విధంగా షాక్‌కు గురయ్యాడు. ఈ భయానక సంఘటన ముంబైలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన చెందిన యువ డాక్టర్‌ ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్‌ పెట్టాడు. 
 
వారు ఆర్డర్ ఇచ్చినట్టుగానే 'ది యుమ్మో బటర్‌స్కాచ్‌' ఫ్లేవర్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌లను ఆ సంస్థ డెలివరీ చేసింది. అతడు దానిని తినడం మొదలుపెట్టాక.. నాలుకకు ఏదో గట్టిగా తగలడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చి దానిని పరీక్షగా చూడగా.. 2 అంగుళాల మనిషి వేలిని గుర్తించాడు. అతడు స్వయంగా డాక్టర్‌ కావడంతో వెంటనే దానిని ధ్రువీకరించుకోగలిగాడు. ఒక్కసారిగా అతడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. 
 
ఆ తర్వాత అతడు తేరుకొని మలాడ్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, ఆ వేలును ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. ఇక ఆ ఐస్‌క్రీం తయారు చేసిన సంస్థ ప్రాంగణంలో కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆ ఐస్‌క్రీమ్‌ తయారీ సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments