Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాము కాటుకు.. ముల్లుకు తేడా తెలియని మీ ఆరోగ్య సిబ్బంది శతకోటి వందనాలు!!

boy dies

ఠాగూర్

, ఆదివారం, 2 జూన్ 2024 (08:50 IST)
పాము కాటుకు, ముల్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని మీ సిబ్బందికి శతకోటి వందనాలు అంటూ ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ఓ తల్లి లేఖ రాశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు దూరమయ్యాడని బాధిత తల్లిదండ్రులు తమ నిరసనను ఓ ఫ్లెక్సీ ద్వారా తెలిపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 21వ తేదీన టెక్కలి మండలం రావివల పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో 12 యేళ్ల దాసరి సాయి వినీత్ క్రికెట్ ఆడుతుండా పాము కాటు వేసింది. ఏదో కుట్టినట్టు అనిపించినా ముల్లు గుచ్చుకుందని తొలుత భావంచారు. కానీ, కొద్దిసేపటికే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా ముల్లు గుచ్చుకుందంటూ రెండు గంటల పాటు సమయం వృథా చేశారని, మృతుడి తల్లి దాసరి మురళి, నిరోషా ఆరోపిస్తున్నారు. 
 
పరిస్థితి విషమించిన తర్వాత తాపీ శ్రీకాకుళం ఆస్పత్రికి తీసుకెళ్లాలని టెక్కలి ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన మృతుడి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది తీరుపై వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. పాము కాటుకు, ముల్లుకు తేడా తెలియని వైద్య సిబ్బందికి శతకోటి వందనాలు. అంటూ జిల్లా ఆస్పత్రికి వెళ్లే కూడలిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశఆరు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డ మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ కమిషనర్‌ను అందులో కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవలం ఒక్క రూపాయి కోసం గొడవకు ఓ నిండు ప్రాణం పోయింది... ఎక్కడ?