ఏడేళ్ల బాలిక రాత్రిపూట ఫ్రైడ్ రైస్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఫ్రైడ్ రైస్ తీసుకోవడం ద్వారా ముక్కులో రక్తం కారడంతో మృతి చెందింది. శుక్రవారం తమిళనాడు సేలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునే ఈ బాలిక శుక్రవారం కూడా ఫ్రైడ్ రైస్ తీసుకుంది.
ఎస్ లక్ష్మీకుమారి అనే ఏడేళ్ల బాలిక ఫ్రైడ్ రైస్‌ను ఇష్టపడుతుండటంతో, ఆమె క్రమం తప్పకుండా తినేదని, శుక్రవారం రాత్రి ఆమె భోజనంలో ఫ్రైడ్ రైస్, చపాతీ, వంకాయల కూర ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత పది గంటల సమయంలో బాలిక ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైందని ఆమె తల్లి ఎస్ పూజాకుమారి వాపోయారు.
చిన్నారి తల్లిదండ్రులు ఆమెను సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. బాలిక మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. విచారణ జరుగుతోంది.