Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధానమంత్రి మోడీ 45 గంటల ధ్యానం ప్రారంభం...

Advertiesment
narendra modi dhyan

ఠాగూర్

, శుక్రవారం, 31 మే 2024 (11:12 IST)
తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో మోడీ ధ్యానం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్‌ నుంచి బయటకు రారని తెలిపాయి. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
 
సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన మోడీ.. తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. 
 
వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. ఇదిలావుంటే.. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి.. తర్వాత గొంతు కోసుకున్న ప్రియుడు (Video)