Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందే వచ్చిన రుతుపవనాలు... ముంబైలో జోరువాన

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (09:25 IST)
ఈ యేడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. గత యేడాదిన్నర కాలంగా కరోనా వైరస్ పుణ్యమాన్ని వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. 
 
మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో మంగళవారం నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపింది. 
 
ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 10వ తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అయితే అవి ఈసారి కాస్త ముందుగా వచ్చేశాయని భారత వాతావరణ శాఖ ముంబై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా.జయంత సర్కార్‌ వెల్లడించారు.
 
ఇదిలావుంటే, ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్‌లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకు 65.4 మిల్లీమీటర్లు, 50.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా చించౌలీ, బొరివాలి, దహిసార్‌లో 60 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించింది. ముంబైతోపాటు రాయ్‌గఢ్‌, థానే, పాల్ఘర్‌, పుణె, నాషిక్‌లలో వర్షం కురిసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments