Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకాల ధర ఎంత?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (09:20 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించింది. అదేసమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకునేందుకు ఆసక్తి చూపనివారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేయించుకోవచ్చని తెలిపింది. పైగా, పైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరను కూడా నిర్ణయించింది. 
 
తాజాగా నిర్దేశించిన రేట్ల ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.780, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ టీకా రేటు రూ.1,145, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకా ధర రూ.1,410గా నిర్ణయించింది. 
 
అన్ని పన్నులతో పాటు ఆసుపత్రులకు చెల్లించే సర్వీస్‌ చార్జి రూ.150 ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు దవాఖానాలు సర్వీస్‌ చార్జి రూ.150 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.
 
ఈ మేరకు ఆయా దవాఖానాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రధాని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్రమే కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వనుండగా.. ఉచితంగా వద్దనుకునే వారికి టీకాలు వేసేందుకు 25శాతం ప్రైవేటు ఆసుత్రులకు ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments