Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ దిగుతానంటూ గట్టిగా వాటేసుకున్నాడు.. కెనడా మహిళపై లైంగిక దాడి

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (10:46 IST)
ముంబైలోని ఓ నక్షత్ర హోటల్‌లో బస చేసిన కెనడా దేశానికి చెందిన ఓ మహిళపై హోటల్ సిబ్బందే లైంగికదాడికి పాల్పడ్డాడు. సెల్ఫీ దిగుతానంటూ ఆమె గదిలోకి వెళ్ళిన సిబ్బంది... ఆమెను గట్టిగా వాటేసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కెనడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 29 యేళ్ళ మహిళ ఒకరు తన వ్యక్తిగత పనుల మీద ముంబైకు వచ్చి ఓ స్టార్ హోటల్‌లో బసచేసింది. తొలుత తన వ్యాపారపనిమీద బయటకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఆ సమయంలో మహిళ బస చేసిన గది వద్దకు హోటల్‌లో పని చేసే సుమిత్ రావు అనే ఉద్యోగి వచ్చి బెల్ కొట్టాడు. దీంతో ఆమె తలుపు తీయడంతో సెల్ఫీ దిగుతానంటూ కోరడంతో ఆమె సమ్మతించింది. 
 
దీంతో గదిలోకి వెళ్లిన సుమిత్ రావు... సెల్ఫీ కోసం ఆమె పక్కకు వెళ్లి గట్టిగా వాటేసుకుని పిచ్చిపచ్చి పనులు చేశాడు. అతని చర్యలతో నిర్ఘాంత పోయిన ఆ మహిళ... కేకలు వేయడంతో ఇతర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. ఆ తర్వాత హోటల్ గదిని ఖాళీ చేసి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం