వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

సెల్వి
శనివారం, 9 ఆగస్టు 2025 (23:07 IST)
Cyber
సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. డబ్బున్న వారినే టార్గెట్ చేసుకొని ఇలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఏకంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలో నివసించే ఆ వృద్ధుడు 2023 ఏప్రిల్‌లో షార్వి అనే మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె మొదట తిరస్కరించినా, తర్వాత ఫ్రెండ్ అయ్యింది. దీంతో అతడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. 
 
షార్వి తన భర్త నుంచి విడిపోయిందని, తన పిల్లలతో ఒంటరిగా ఉంటోందని చెప్పి, ఆర్థికంగా సహాయం చేయమని కోరింది. ఆ వృద్ధుడు ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. ఇలాగే మరో మూడు అకౌంట్లతో వృద్దుడు చాట్ చేసేవాడు. షార్వి తన పిల్లలకు ఆరోగ్యం బాలేదని చెప్పి.. పలు మార్లు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు తీసుకుంది. 
 
మరోవైపు జాస్మిన్ అనే మరో మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేశాడు. ఆమె దినాజ్ ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంది. కల్లబొళ్లి మాటలతో డబ్బు అవసరాలకు వృద్ధడి నుంచి డబ్బులు పంపించుకుంది. అలా 21 నెలల్లో నాలుగు అకౌంట్లకు 734 సార్లు డబ్బులు పంపించాడు. 
 
పాపం.. దాదాపు రూ. 8.7 కోట్లు వారు కాజేశారు. తాను మోసపోయానని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనైన వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించారు. జూలై 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments