కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేశాడు.. 25ఏళ్ల జైలుశిక్ష

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (22:19 IST)
కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మైనర్ కూతురిపై కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. బెదిరింపులకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో బాలిక శరీరంలో శారీరక మార్పులు గ్రహించిన ఆమె బామ్మ నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం గతేడాదే జరిగింది. తాజాగా కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. భర్త వేధింపులతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. 
 
అయితే నిందితుడి తల్లి తన పెన్షన్ డబ్బులతో మనవరాలిని ,మనవడిని చూసుకునేది. కొడుకు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంతలో మనవరాలి శరీరంలో మార్పులు గమనించింది. 
 
బాలికను నిలదీస్తే భయంతో తన తండ్రి ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో బాధితుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ బాలిక పోలీసులకు మాత్రం తండ్రిపై ఫిర్యాదు చేయలేదు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు బాలిక పట్ల అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తేల్చింది . నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments