Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (17:33 IST)
అమ్మా... భోజనానికి ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పిన ఒక యువ వైద్యుడు అటల్ సేతు వంతెనపై నుంచి నీటిలోకి దూకిన ఘటన ముంబై నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో ఈ తీవ్ర నిర్ణయం తీకసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
ముంబైలోని ప్రఖ్యాత జేజే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ఓంకార్ (32) జూలై 7వతేదీ రాత్రి విధులను ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నట్టు తెలిపారు. అయితే, రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో ముంబైని నవీ ముంబైను అనుసంధానించే అటల్  సేతు వంతెనపై తన కారును ఆపారు. ఆ తర్వాత ఒక్కసారిగా వంతెన పైనుంచి నీటిలోకి దూకేశారు. 
 
గమనించిన స్థానికులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, వంతెనపై ఆపి ఉన్న కారును, అందులోని ఐఫోన్‌ను గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి డాక్టర్ ఓంకార్‌గా నిర్ధారించారు. 
 
ప్రస్తుతం కోర్ట్ గార్డు సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా డాక్టర్ ఓంకార్ ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పిన ఆయన, ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments