Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 5 జులై 2025 (23:05 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సోమవారం నాడు పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలు మెదలు పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఉద్యోగ విధుల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు కష్టసమయం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తిచేస్తారు. శుక్రవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివవ్వద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనంతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. అవకాశాలు అందినట్లే చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఏకాగ్రతతో ఉద్యోగ విధులు నిర్వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. హోల్సేల్ వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. అయిన వారిని సంప్రదిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు స్థానచలనంతో అవస్థలు తప్పవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీ కదలికలను కొందరు గమనిస్తున్నారని తెలుసుకోండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. దస్త్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహిస్తారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకమే. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబపరంగా శుభవార్త వింటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. వాయిదాల చెల్లింపులో జాప్యం తగదు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆప్తులతో తరుచుగా సంభాషిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తులకు శుభయోగం. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు, ప్రణాళికులు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సోదరీ సోదరులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఓర్పుతో మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలించే సమయం త్వరలోనే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయాలు సేకరించేందుకు కొందరు యత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. అవివాహితులకు శుభం కలుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఒత్తిళ్లు, ఆవేశాలకు గురికావద్దు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ముఖ్యులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనాలున్నాయి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఇతరులు మీ విషయాలకు దూరంగా ఉంచండి. శుక్రవారం నాడు అనవసర విషయాల జోలికి పోవద్దు. ఇంటి పరిస్థితులపై దృష్టిసారించండి. ఖర్చులు అంచనాలు భిన్నంగా ఉంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. సోమవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బుధవారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వాస్తుదోష నివారణ చర్చలు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులపై దృష్టి పెడతారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ