Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరిని ప్రేమించింది.. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకుంది.. చివరికి?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (10:03 IST)
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధానికి గౌరవం దక్కట్లేదు. అలాగే ప్రేమలో నిజాయితీ సన్నగిల్లుతోంది. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు, సహజీవనాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించిన ఓ యువతి.. మరొకరి సాయంతో ప్రియుడిని హత్య చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... ముంబై ఫరూక్‌ నగర్‌ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌ (24), పర్వీన్‌ బేగం (18) మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ (23)తో పర్వీన్‌కు పరిచయం కాగా, అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన సమయంలో, శేఖర్ విషయం ఆసిఫ్‌కు తెలిసింది. 
 
ఈ విషయంలో పర్వీన్‌ను నిలదీశాడు. శేఖర్ తన వద్ద రూ. 4,500 అప్పు తీసుకున్నాడని, దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆసిఫ్‌పై శేఖర్‌కు అబద్ధాలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఆసిఫ్‌ను చంపేందుకు శేఖర్ పర్వీన్‌కు సాయం చేశాడు. ఈ క్రమంలో 19వ తేదీ రాత్రి శేఖర్‌ను తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది.
 
శేఖర్ మత్తులోకి జారుకోగానే, ప్రియుడి సాయంతో గొంతుకోసి చంపేసింది. ఇలా హత్య చేసి ముంబై పారిపోతూ షాద్ నగర్ పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం