Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాక్ ఒబామా - హిల్లరీ క్లింటన్‌ హత్యకు కుట్ర... నివాసాలకు భారీగా పేలుడు పార్శిల్స్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (09:41 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ హత్యకు కుట్ర పన్నారా? వారిద్దరి నివాసాలకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో కూడిన పార్శిల్స్ పంపారు. ఈ విషయం ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
రెండు రోజుల కిందట న్యూయార్క్ నగర శివారుల్లో ఫిలాంత్రోఫిస్ట్ జార్జ్ సోరోస్ ఇంటి వద్ద బాంబు దొరికిన నేపథ్యంలో తాజా పార్సిల్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా 'మాజీ'లకు పంపిన పార్శిళ్లను తనిఖీ చేసినపుడు అనుమానిత పదార్థాలు గుర్తించారు. అయితే ఈ అనుమానిత పార్శిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియలేదు.
 
ఈ పేలుడు పదార్థం గురించి తెలియగానే న్యూయార్క్‌లోని పలు కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఫైర్ అలారం మోగించినట్టు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నారు. అమెరికా నిఘా, రహస్య విభాగం చేసిన ప్రకటన మేరకు ఈ నెల 23వ తేదీన సాయంత్రం హిల్లరీకి పంపిన పార్శిల్‌ను మొదట గుర్తించారు.
 
బుధవారం తెల్లవారుజామున ఒబామాకు పంపిన పార్శిల్ వెలుగులోకి వచ్చింది. ఈ పార్శిళ్లలో పేలేందుకు అవకాశమున్న పరికరాలను గుర్తించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పారు. ఎఫ్‌బీఐ అధికారులు మాట్లాడుతూ తమకూ ఈ అనుమానిత పార్శిళ్ల సమాచారం అందిందని.. దర్యాప్తు అధికారులకు తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై మాట్లాడేందుకు ఒబామా అధికార ప్రతినిధి నిరాకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments