Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇరాక్ పార్లమెంట్‌లో అమెరికా జాతీయ జెండాకు నిప్పంటించారు.. ఎందుకంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని.. తాజాగా అమెరికా అధ్యక్షుడు రద్దు చేసుకోవడంతో ఇరాన్ మండిపడుతోంది. ఇరాన్‌తో అణు సంబంధాలను తెంచుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటిం

ఇరాక్ పార్లమెంట్‌లో అమెరికా జాతీయ జెండాకు నిప్పంటించారు.. ఎందుకంటే?
, గురువారం, 10 మే 2018 (12:15 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని.. తాజాగా అమెరికా అధ్యక్షుడు రద్దు చేసుకోవడంతో ఇరాన్ మండిపడుతోంది. ఇరాన్‌తో అణు సంబంధాలను తెంచుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంతేకాదు, 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ తిరిగి ఇరాన్‌పై విధిస్తామని ప్రకటించారు. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మరే దేశమైనా ఇరాన్‌కు సహకారం అందిస్తే అమెరికా తీసుకునే చర్యలకు గురికావాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. 
 
అయితే అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడానికి నిరసనగా ఇరాన్ పార్లమెంటులో అమెరికా జాతీయ జెండాను తగలబెట్టి ఘోరంగా అవమానించింది. దీనిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ మొదలైంది. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అమెరికా తీరుపై ఇరాన్ సభ్యులు నినాదాలు చేశారు. 
 
అనంతరం యూఎస్ జాతీయ పతాకానికి నిప్పు పెట్టారు. దీంతో ఇరాన్ పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ.. ట్రంప్ అనవసరంగా తమపై బురద జల్లుతున్నారని.. అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమాస్తుల కేసు రూ.100కోట్ల జరిమానా.. జయలలిత ఆస్తుల స్వాధీనం..?