Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బార్‌ రహస్య గదిలో దాగిన అందమైన అమ్మాయిల అరెస్టు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (14:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అంధేరిలో ఓ బార్‌ల సీక్రెట్ గదిలో దాగివున్న అనేక మంది అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయిలతో బార్ నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అంధేరిలోని దీపా బార్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. అయితే, ఈ బార్ ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని, అందులో బార్ గర్ల్స్ ఉన్నట్టుట ఓ ఎన్జీవో సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీస్ శాఖకు చెందిన సోషల్ సర్వీస్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. 
 
శనివారం రాత్రి 11 గంటల సమయంలో దీపా బార్‌లో తనిఖీలు మొదలుపెట్టారు. బార్‌లోని అని గదులతో పాటు.. బాత్రూమ్, స్టోరేజ్ రూమ్, కిచెన్‌లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బార్ గర్ల్స్ మాత్రం అధికారుల కంటికి కనిపించలేదు. దీంతో అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. 
 
రెండో రోజైన ఆదివారం రాత్రి కూడా ఈ బార్‌లో అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో గ్రీన్ రూమ్ పక్కన ఉన్న ఒక గ్లాస్ ప్యానెల్‌ను అధికారులు గుర్తించారు. ఇది అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని పగులగొట్టారు. 
 
ఈ గ్లాస్ ప్యానెల్ లోపల మరో ఎలక్ట్రానిక్ డోర్‌ ఉన్నట్టు గుర్తించి, దాన్ని ఓపెన్ చేయించారు. అందులో 17 మంది అందమైన అమ్మాయిలు ఉండటాన్ని చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఆ తర్వాత వారందరినీ అదుపులోకి తీసుకుని, బార్‌పై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments