Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు రాసిన తనయుడు.. ఎక్కడ?

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక పోలీసు బృందంలో ఉన్న ఓ అధికారి భార్య ఇటీవల తన ఇంట్లో అనుమానాస్పదరీతిలో హత్యకు గురైంది. ఈ కేసులో తనయుడే కాలయముడయ్యాడు. దీంతో అ

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (12:03 IST)
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక పోలీసు బృందంలో ఉన్న ఓ అధికారి భార్య ఇటీవల తన ఇంట్లో అనుమానాస్పదరీతిలో హత్యకు గురైంది. ఈ కేసులో తనయుడే కాలయముడయ్యాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిని హత్య చేసిన ఆ రాక్షసుడు.. ఇంట్లోనే రక్తాక్షరాలు రాశాడు. ఇలా ఎందుకు చేశాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
అతని పేరు సిద్ధాంత్. ముంబైలోని ఓ ప్రముఖ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఇటీవల తన తల్లి దీపాలి పీక కోసి చంపేశాడు. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు. కన్నతల్లిని పీక కోసి, కత్తితో నాలుగైదు సార్లు పొడిచి మరీ చంపినట్టు ఆ కసాయి వెల్లడించాడు.
 
హత్య తర్వాత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు పారిపోయిన సిద్ధాంత్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అక్కడి హోటల్లో ఉండగా విశ్వసనీయంగా సమాచారం అంది పోలీసులు వెళ్లడంతో సిద్ధాంత్ దొరికిపోయాడు. అయితే, తల్లిని ఎందుకు అంత పాశవికంగా హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments