Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైల్ టిక్కెట్ ధర ఎంత? ఏయే స్టేషన్లలో ఆగుతుంది?

దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అమ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూ

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:31 IST)
దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అమ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూజ చేయడం జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు పాల్గొన్నారు.
 
కాగా, అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ - ముంబైలోని బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రాజెక్టును చేపడుతారు. మొత్తం 508 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైలు మార్గాన్ని 27 కిలోమీటర్ల సొరంగ మార్గంలోనూ, 12 కిలోమీటర్లు వంతెనలపైనా, మరో 468 కిలోమీటర్లు భూమిపై నిర్మించనున్నారు. 
 
ఈ మార్గంలో బుల్లెట్ రైలు నాలుగు రైల్వే స్టేషన్లలో ఆగి వెళితే ప్రయాణ సమయం 2 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది. కానీ, మొత్తం 12 స్టేషన్లలో ఆగి వెళ్లేలా ప్రతిపాదనలు చేస్తోంది. ఇందులో బాంద్రా కుర్లా, థానే, విరార్, బోయిసర్, వప్లే, బిల్‌మోరా, సూరత్, బహ్రుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషనలో ఆగి వెళ్లేలా ప్రతిపాదిస్తున్నారు. ఇలా 12 స్టేషన్లలో ఆగి వెళితే మాత్రం ప్రయాణ సమయం 2 గంటల 58 నిమిషాల సమయం పడుతుంది. 
 
అలాగే, బుల్లెట్ రైలులో ప్రయాణ టిక్కెట్ ధర ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా... రూ.2700 నుంచి రూ.3000లోపు ఉండనుంది. కానీ, ఈ మార్గంలో విమాన టిక్కెట్ ధర రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉండగా, లగ్జరీ బస్సులో రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments