Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపిన యువతి.. కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఎలా?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (10:41 IST)
దేశంలో మహిళలపై వేధింపులు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఫేస్‌బుక్ వేదికగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ముంబైలోని అగ్రిపాడాకు చెందిన ఓ 13ఏళ్ల బాలిక ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపేది. ఈ క్రమంలోనే ఓ యువకుడి (22)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 
 
అయితే సదరు యువకుడు ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి రాజస్థాన్‌ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే జూలై ఒకటో తేదీన సదరు బాలిక కనపడకపోవడంతో పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించారు. 
 
దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు రాజస్థాన్‌లోని జల్వాడ్, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు వెళ్లి అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 13 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments