Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని గారూ! మాస్కులు, వెంటిలేటర్లు ఉన్నాయా?: రాహుల్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (05:04 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంభోదిస్తూ.. వరల్డ్ హెల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం సరిపడినన్ని వెంటిలేటర్లు, మాస్కులను ప్రజలకు అందుబాటులో ఉంచారా అని ప్రశ్నించారు.

ఇప్పుడు దేశంలో ఉన్న వెంటిలేటర్లు ఏ మూలకూ సరిపోవని పేర్కొన్న రాహుల్…మార్చి 19 వరకూ వెంటిలేటర్ల దిగుమతికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు.

అదేమన్నా పండుగా?
అత్యవసర సేవలందించే వారికి కృతజ్ఞతగా చప్పళ్లు మోగించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఆ కార్యక్రమాన్ని ఓ పండగలా చేశారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు.

కోవిడ్ ఓ వైపు విజృంభిస్తున్నా సరే, చప్పళ్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రజలు ఓ పండగలా చేసి, తీవ్రతను చెడగొట్టారని, ఇప్పుడు లాక్‌డౌన్‌ను ప్రజలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అంటే లాభమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

‘‘లాక్‌డౌన్‌ను ప్రజలు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఇప్పుడు ప్రధాని అంటున్నారు’’ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అంతేకాకుండా ‘‘ఇంతటి తీవ్రమైన, భయానక వాతావరణాన్ని ఓ పండుగ వాతావరణంలా సృష్టించేశారు.

ఇదంతా మీ వల్లే. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే ప్రజలు కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందించేవారు’’ అని సంజయ్ రౌత్ తీవ్రంగా విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments