Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులొచ్చాయ్.. సైకిల్‌పై 6కిలో మీటర్ల మేర నిండు గర్భిణీ పయనం.. ఆపై ఏం జరిగింది..?

ఒడిశాలో మరణించిన భార్య శవాన్ని కిలోమీటర్ల మేర మోసిన భర్త ఘటన మరవకముందే.. నిండు గర్భిణికి పురిటినొప్పులొచ్చినా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సేవలు అంతగా సహకరించలేదు. దీంతో సైకిల్ పైనే వెళ్ళిన బాలింత ఓ పండ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (12:08 IST)
ఒడిశాలో మరణించిన భార్య శవాన్ని కిలోమీటర్ల మేర మోసిన భర్త ఘటన మరవకముందే.. నిండు గర్భిణికి పురిటినొప్పులొచ్చినా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సేవలు అంతగా సహకరించలేదు. దీంతో సైకిల్ పైనే వెళ్ళిన బాలింత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఛాట్టార్ పూర్ జిల్లా షాహపూర్ గ్రామానికి చెందిన పార్వతి (22) అనే మహిళ నిండు గర్భిణి. ఈమెకు పురిటి నొప్పులు రావడంతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేసినా స్పందన రాలేదు. 
 
దీంతో పార్వతిని ప్రసవం కోసం తీసుకువెళ్లేందుకు ఆమె తండ్రి నన్హేభాయి అంబులెన్సు నుంచి సమాధానం రాకపోవడంతో తన కూతురును సైకిల్‌పై కూర్చోబెట్టి.. ఆరుకిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో పార్వతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మళ్లీ తల్లీ బిడ్డలను సైకిలుపైనే ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు.
 
తన కూతురు పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ కోసం చాలాసార్లు ఫోన్ చేశానని.. అయితే స్పందన లేకపోవడంతో సైకిల్ పైనే ఆస్పత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments