Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి నిరాకరించింది.. అత్త కనికరించింది.. కోడలికి ప్రాణదానం...

సాధారణంగా అత్తల వేధింపులు భరించలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న వేధింపుల పేరుతో తమ కోడళ్ళకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ అత్త మాత్రం తన కోడలికి ప్రాణదానం చేసింది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (12:48 IST)
సాధారణంగా అత్తల వేధింపులు భరించలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వరకట్న వేధింపుల పేరుతో తమ కోడళ్ళకు నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ అత్త మాత్రం తన కోడలికి ప్రాణదానం చేసింది. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లే కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ముందుకురాలేదు. కానీ ఆ అత్త మాత్రం ముందుకు వచ్చి కోడలి ప్రాణాలు కాపాడింది. ఇపుడు ఆ అత్తపై సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు.. స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని బాడ్మేర్‌కు చెందిన గాంధీనగర్ నివాసి సోనికా. ఈమె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మెడికేషన్ సపోర్టుతో జీవిస్తోంది. ఈ నేపథ్యంలో సోనికాకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచన చేశారు. 
 
అయితే, సోనికాకు కిడ్నీ ఇచ్చేందుకు ఆమె కన్నతల్లితో పాటు సోదరుడు కూడా ముందుకురాలేదు. కానీ, అత్త గోనీదేవి మాత్రం పెద్ద మనసుతో తన కోడలికి ప్రాణదానం చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు గోనీదేవి కిడ్నీ సరిపోతుందని నిర్ధారించారు. 
 
ఆ తర్వాత అత్త కిడ్నీ దానం చేయగా, దాన్ని కోడలు సోనికాకు వైద్యులు అమర్చారు. ఫలితంగా సోనికా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంది. ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు అత్త గోనీ‌దేవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments