Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వ్యవహారం.. కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (10:16 IST)
తన మనస్సుకు నచ్చిన యువకుడిని కన్నకుమార్తె ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని కన్నతల్లి.. కన్నబిడ్డను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కౌశాంబికి చెందిన ఓ మహిళకు 15 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువకుడితో ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన కన్న తల్లి ఆగ్రహానికి గురై కుమార్తెను మందలించింది. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోలేదు. తన 15 యేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి చంపేసింది. ఆమెకు ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఆ తర్వాత మృతదేహాన్ని బావిలో పడేశారు. 
 
ఆ తర్వాత తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు మంజన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన తేజ్వాపూర్ గ్రామం వెలువల వ్యవసాయ బావిలో ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళకు చూపించగా, ఆ మృతదేహం తన కుమార్తెదేనని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు మరింత లోతుగా విచారించగా, ఆ మహిళ నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ఇతర కుటుంబ సభ్యులతో పాటు మైనర్ కుమార్తెను కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కోడలు మీరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments