Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని కోల్పోయా.. మన్మోహన్ :: మూలస్తంభం కూలిపోయింది.. రౌత్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (13:05 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నమ్మినబంటు అయిన అహ్మద్ పటేల్ చనిపోయారు. నెల రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
దీనిపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ తీవ్ర సంతాపం వ్య‌క్తంచేశారు. అహ్మ‌ద్‌ ప‌టేల్ త‌న‌కు గొప్ప స్నేహితుడ‌ని, ఆయ‌న అకాల మ‌ర‌ణ‌వార్త తెలిసి తాను తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని తెలిపారు. 
 
ఈ మేర‌కు ఆయన మీడియాకు ఒక సంతాప సందేశాన్ని విడుద‌ల చేశారు. ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మ‌న్మోహ‌న్ త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆహ్మ‌ద్‌ ప‌టేల్‌ను కోల్పోయిన అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.    ‌
 
అలాగే, శివ‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ స్పందిస్తూ, రెండు రోజుల క్రితమే తాను అహ్మ‌ద్‌ ప‌టేల్ కుటుంబ‌స‌భ్యుల‌ను క‌లిశాన‌ని, ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే సైతం వారితో మాట్లాడార‌ని సంజ‌య్ రౌత్ చెప్పారు. అహ్మ‌ద్‌ప‌టేల్‌ను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి త‌ర‌లిద్దామ‌ని వారికి చెప్పామ‌ని, అయితే ఇంత‌లోనే ఆయన మ‌ర‌ణ‌వార్త వినాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.
 
అహ్మద్‌ ప‌టేల్ మ‌ర‌ణం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక మూల‌స్తంభాన్ని కోల్పోయింద‌ని సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు. ఆయ‌న‌ విశ్వాసానికి మారుపేర‌ని, రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ పార్టీకి న‌మ్మినబంటుగా ఉండ‌టం ఎలాగో ఆయ‌న‌ను చూసి నేర్చుకోవాల‌న్నారు. అహ్మ‌ద్ ప‌టేల్ ఒక సంస్కార‌వంతుడైన రాజ‌కీయ నాయ‌కుడ‌ని రౌత్ కొనియాడారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments