Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కో - గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:51 IST)
మాస్కో - గోవా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ విమానాశ్రయంలో కిందకు దించేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, బాంబు స్క్వాడ్‌తో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
మొత్తం 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 277 మందితో మాస్కో నుంచి గోవాకు ఓ విమానం వస్తుంది. ఈ విమానానికి ఉన్నట్టుండి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమాంలో బాంబు ఉన్నట్టు గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఆ విమానాన్ని జామ్ నగర్ విమానాశ్రయానికి మంళ్లి అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. 
 
అప్పటికే సిద్ధంగా ఉన్న బాంబు డిస్పోజల్ సిబ్బంది ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. పైగా, ఆ విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. విమానంలోని 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిని గత రాత్రి 9.49 గంటల సమయంలో సురక్షితంగా ఖాళీ చేయించినట్టు జామ్ నగర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తెలిపారు. 
 
అయితే, విమానంలో రాత్రంతా తనిఖీ చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనుమానాస్పద వస్తువేదీ కనిపించలేదని నిర్ధారించిందని తెలిపారు. ప్రతి ప్రయాణికుడి లగేజీని కూడా తనిఖీ చేసినట్టు జామ్ నగర్ ఎస్పీ వెల్లడించారు. ఈ బాంబు బెదిరింపు ఉత్తుత్తిదేనని తేలడంతో ప్రయాణికులతో విమానం తిరిగి గోవా వెళ్లేందుకు అనుమతి లభించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments