Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ - విశాఖల మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:03 IST)
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారతీయ రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక వందే భారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సేవలను ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలుత సికింద్రాబాద్ - విజయవాడల మధ్యే నడుపుతారంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు నడుస్తుందని తెలిపారు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తుందన్నారు. 
 
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, ఈ నెల 19వ తేదీన ఈ రైలు సేవలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభమయ్యే ఎనిమిదో వందే భారత్ రైలు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments