కాపు జాతిని లాగావో నీ తాట తీస్తాం.. వర్మకు కాపు నేతల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:48 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు కాపు సామాజిక వర్గానికి చెందిన సంఘాల నేతలు బహిరంగ హెచ్చరిక చేశారు. రాజకీయ వివాదాల్లోకి కాపు సామాజిక వర్గానికి లాగితే తాట తీస్తామంటూ హెచ్చరించారు. రాజకీయంగా టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లను ఎన్ని రకాలుగానైనా విమర్శించుకోండి. కానీ, కాపు ప్రజలను లాగితే మాత్రం సహించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. 
 
చంద్రబాబు - పవన్ భేటీ రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, "రిప్ కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు" అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కాపు సంఘాలకు చెందిన పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చి ఆర్జీవికి హెచ్చరికలు చేశారు. తమను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి, పిచ్చి వ్యాఖఅయలు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.
 
ఆర్జీవీ ఇటువంటి పిచ్చిమాటలు, వేషాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గతంలో కూడా వంగవీటి రంగాపై ఆయన చేసిన సైకో వ్యాఖ్యలు మర్చిపోకముందే ఇపుడు కాపుల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ఆ వివాదాల్లోకి కాపు జాతిని తీసుకుని రావొద్దని రాష్ట్రమంత్రులను కోరారు. లేదంటే తమ సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపిస్తామని మందలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments