Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఒకపుడు గుర్తింపును సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మసాజ్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, ఇది అమ్మాయలు మసాజ్ చేసే సెంటరు కాదు. రోబోటిక్ మసాజ్ సెంటర్. 
 
ఈ అత్యాధునిక మసాజ్ సెంచటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుంతో బాటీ, ఫుట్ మసాజ్ సేవలు పొందొచ్చు. ఒకటో నంబరుఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఈ రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
 
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజరు శివేంద్ర మోహన్ సోమవారం వీటిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ.60, ఫుట్ మసాజ్‌కు రూ.30 చొప్పు రుసుం వసూలు చేస్తారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన ఔట్ లెట్స్‌ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments