Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌లో మోహన్ లాల్ సహాయ చర్యలు.. రూ.3 కోట్ల విరాళం

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (17:11 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‍లో‌ కొండచరియలు విరిగిపడిన ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ పర్యటించారు.
 
మోహన్‌లాల్‌ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్‌లాల్‌, అక్కడ అధికారులతో మోహన్‌లాల్‌ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం ముండక్కై, చుర్‌ము‌లాల్‌ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్‌లాల్‌ పరామర్శించనున్నారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్‌ లాల్‌.. కేరళ సీఎం సహాయ నిధికి రూ.3 కోట్ల విరాళంగా కూడా అందించారు. ఈ మొత్తాన్ని తన తల్లిదండ్రుల పేరుతో నెలకొల్పిన విశ్వశాంతి చారిటబుల్ ట్రస్ట్ తరపున అందజేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments