Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్టులు కడితేనే వర్షం వస్తుందా..ప్రధాని అంతమాటన్నారంటే ఏదో ఉంది మరి?

అది న్యూఢిల్లీ.. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంభాషణలో మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఎన

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (06:58 IST)
అది న్యూఢిల్లీ.. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంభాషణలో మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఎన్డీఏకి మద్దతిస్తున్న ముఖ్యమంత్రులతో పాటు సామాజిక విశ్లేషకులను కూడా విస్మయంలో ముంచెత్తింది. ఆలోచనలో కూడా పడేసింది. నీటి ప్రాజెక్టుల వెంట పడ్డారు కాబట్టే తెలంగాణలో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
 
‘‘రావు జీ... వర్షాలు బాగా పడుతున్నాయా’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ప్రక్రియకు హాజరైన సీఎంలతో మోదీ శుక్రవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంను ఆయన పలకరించారు. తెలంగాణలో వానలు బాగా పడుతున్నాయా అని ఆరా తీశారు. బాగానే పడుతున్నాయని సీఎం బదులిచ్చారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు కల్పించుకుని, ‘వాళ్లకు రెండేళ్లుగా బాగానే పడుతున్నాయి. మా ప్రాంతంలోనే వర్షపాతం తక్కువగా ఉంది’’అని అన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లను కూడా ఇదే అంశమై ప్రధాని పలకరించగా తమ రాష్ట్రాల్లో వర్షాలు ఆశించిన మేర లేవని చెప్పారు. ‘మీరు నీటి ప్రాజెక్టుల వెంటపడ్డారు . అందుకే వర్షాలు పడుతున్నట్టున్నాయి’అని కేసీఆర్‌తో ప్రధాని అన్నట్టు సమాచారం.
 
ప్రాజెక్టులపై సోకులు, మాటలు కాకుండా నిజమైన అవసరంతో, తపనతో ప్రయత్నాలు మొదలుపెడితే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న భావం మోదీ మాటల్లో ఉందా అని విశ్లేషకులు ఆలోచించుకుంటున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments