భారత్‌లో ఆ రెండూ లేకుంటే ఏం.. అసలుది మరొకటుంది కదా అంటున్న ఎన్ఆర్ఐ
సంపన్న దేశాల వద్ద ఉన్న డబ్బులు కానీ, నైపుణ్యం కానీ భారత్ వద్ద లేకపోవచ్చు కానీ ఆ రెండింటి అవసరం పుల్లుగా తీర్చే అవకాశం భారత్ వద్ద ఉందని ప్రముఖ ప్రవాస భారతీయుడు జీపీ హిందూజా పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా తన పెట్టుబడిని, తన నైపుణ్యాన్ని పూర్తిస్థాయి
సంపన్న దేశాల వద్ద ఉన్న డబ్బులు కానీ, నైపుణ్యం కానీ భారత్ వద్ద లేకపోవచ్చు కానీ ఆ రెండింటి అవసరం పుల్లుగా తీర్చే అవకాశం భారత్ వద్ద ఉందని ప్రముఖ ప్రవాస భారతీయుడు జీపీ హిందూజా పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా తన పెట్టుబడిని, తన నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలంటే అందుకు ఏకైక వనరు భారత దేశమేనని ఆయన చెప్పారు. అందుకోసమే చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ భారత్‌తో కలిసి పని చేయాలని హిందూజా పిలుపునిచ్చారు.
ప్రపంచంలో కేవలం భారత్‌లో మాత్రమే పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ ఎంట్రప్రెన్యూర్ జీపీ హిందూజా అభిప్రాయపడ్డారు. ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి చైనా, ఇండియా, యూకేల మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ‘చైనీయుల వద్ద డబ్బులున్నాయి. బ్రిటన్ వారి వద్ద నైపుణ్యత ఉంది. భారత్, చైనా, యూకే మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరం. దీనిపై ఆయా దేశాల ప్రభుత్వాలు కృషిచేయాలి’ అని హిందూజ గ్రూప్ కో–చైర్మన్ జీపీ హిందూజా గురువారం రాత్రి చైనా బిలియనీర్లు, బ్రిటిష్ ప్రభుత్వపు ప్రతినిధులతో నిర్వహించిన ఒక సమావేశంలో పేర్కొన్నారు.
భారత్ వద్ద పెట్టుబడులు, నైపుణ్యం రెండూ లేవని సుతిమెత్తగా తెలిపిన హిందుజా లాభాల పంట పండాలంటే మాత్రం భారత్ లోనే అవకాశాల గనులున్నాయని స్పష్టం చేశారు.