Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోదీ #Tadasana video

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (15:38 IST)
జూన్ 21వ తేదీన జరుగనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి స్వాగతం పలుకుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ పేజీలో మోదీ అనిమేషన్ యోగా వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
2014వ సంవత్సరం దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన యోగాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ యోగా డేకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం యోగా డేకు మరింత మెరుగు దిద్దేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతుంది. ప్రతి ఏడాది మంత్రులు, కార్యకర్తలు, ప్రజలతో చేరి యోగాసనాలు చేస్తుంటారు. 
 
ప్రస్తుతం భారత దేశ రెండో ప్రధాన మంత్రిగా బాధ్యతల చేపట్టిన మోదీ.. తన హయాంలో రెండో ప్రధానిగా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఐటీ అధికారుల బృందంతో మోదీ యోగా చేసే విధంగా యానిమేషన్ వీడియోను రూపొందించాల్సిందిగా ఆదేశించారు.
 
ఈ యానిమేషన్ వీడియోలో ప్రధాన మంత్రి మోదీ ఉదయం చేసే యోగాసనాల్లో ఒకటైన ''తడాసన''ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు కలదు. ఈ వీడియోను మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఆసనం నేర్చుకుంటే ఇతర ఆసనాలను సులభం నేర్చుకోవచ్చునని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments