Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యవసర వినియోగం : మోడెర్నా టీకాకు డీజీసీఏ అనుమతి!

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:58 IST)
అమెరికాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ మోడెర్నా దిగుమతికి భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీఐ) అనుమతి వచ్చింది. ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి 'పరిమిత అత్యవసర వినియోగం' కింద ఆ టీకాను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడించారు. 
 
మోడెర్నా ఆగమనంతో భారత్‌లో అనుమతి పొందిన కొవిడ్‌ టీకాల సంఖ్య నాలుగుకు చేరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ టీకాలకు అనుమతి ఉంది. మోడెర్నా ఇప్పుడు నాలుగో టీకా. ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. 
 
కాగా.. తాము మోడెర్నా దిగుమతి కోసం సోమవారం డీసీజీఐకి అనుమతి చేసుకున్నామని, ఒక్కరోజులోనే అనుమతులు వచ్చాయని సిప్లా కంపెనీ వెల్లడించింది. తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి వారం రోజులకు సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితిని డీసీజీఐకి సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments