Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం... 37 నేతలకు లేఖలు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:01 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దేశంలోని పలు రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం రండంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశంలోని రాజకీయ పార్టీల్లో 37 మంది నేతలకు ఆయన లేఖ రాశారు. అఖిల భారత సామాజిక న్యాయం పేరుతో ఆయన ఈ లేఖ రాశారు. 
 
ప్రధానంగా దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమనున్నవారంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అంతేకాకుండా, మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని సీఎం స్టాలిన్ తన లేఖలో పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఏకతాటిపైకి వస్తే మినహా ఈ మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యంపై పోరాటం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఈ లేఖలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments