Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డోల్ భాజే' పాట‌కు మానుషి నృత్యం.. వీడియో వైరల్

విశ్వసుందరిగా ఎన్నికైన భారతీయ సుందరాంగి మానుషీ చిల్లర్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు. రామ్‌లీలా చిత్రంలోని 'డోల్ భాజే' పాట‌కు మా

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (15:52 IST)
విశ్వసుందరిగా ఎన్నికైన భారతీయ సుందరాంగి మానుషీ చిల్లర్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు. రామ్‌లీలా చిత్రంలోని 'డోల్ భాజే' పాట‌కు మానుషి చిల్లర్ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ వీడియోను కేవ‌లం మూడు రోజుల్లో 1.2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. 
 
ఇటీవ‌ల చైనాలోని స‌న్యా సిటీలో జరిగిన మిస్ వ‌ర‌ల్డ్ 2017 పోటీల్లో భార‌త సుంద‌రి మానుషీ చిల్ల‌ర్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో పోటీల్లో గెల‌వ‌డానికి దోహ‌ద‌ప‌డిన ప్ర‌శ్న‌లు - జ‌వాబుల వీడియో ఒక‌టి వైర‌లవుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో ఆమెకు సంబంధించిన మ‌రో వీడియో వైర‌ల్‌గా మారింది. 
 
ఈ వీడియోలో ప్ర‌పంచ సుంద‌రి పోటీల్లో పాల్గొన్న వారంద‌రూ త‌మ‌ను తాము ఒక్కొక్క‌రిగా ప‌రిచ‌యం చేసుకోవ‌డం, త‌ర్వాత వేదిక మీద త‌మ త‌మ దేశ సంప్ర‌దాయాల‌ను గుర్తుచేసేలా నృత్యాలు చేయ‌డం చూడొచ్చు. ఆ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments