Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమోసాల ఆశచూపి... ఆరేళ్ళ బాలికపై తాత - మేనమామ అత్యాచారం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ళ పసిపాపపై తాతతో పాటు మేనమామ కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. అదీకూడా మూడేళ్ళ తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురైంది. భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 
 
భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అనుభవిస్తున్న బాధ గురించి చెప్పింది. 
 
సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఆమె తాత వచ్చిఉన్నాడు. వారిద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు.
 
ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయారు. 
 
అయితే, బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments