Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరిట మోసం చేశాడు.. అబార్షన్ చేయించి మొహం చాటేశాడు..

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (18:16 IST)
ప్రేమ పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. ఆపై అబార్షన్ చేయించాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని నూతలపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం పోతుకట్లలో జరిగిన తిరునాళ్లకు వెళ్లింది. 
 
అక్కడ పోతుకట్ల గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆమెను కలిశాడు. బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై ఆ యువకుడు లొంగదీసుకున్నాడు. శారీరకంగా కలిశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీయడంతో ఇప్పటికి అబార్షన్ చేసుకోమని.. మందులు ఇప్పించి గర్భం పోయేలా చేశాడు. ఆపై పెళ్లి చేసుకునేది లేదని మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికపై 16వ ఏట నుంచే లైంగిక దాడి జరిగిందని.. ప్రస్తుతం ఆ బాలిక 18 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం