Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం.. మద్దతిస్తామన్న అసదుద్ధీన్ ఓవైసీ

తెలుగు ప్రజలకు అన్యాయం చేశామనే సానుభూతి దేశంలోని రాజకీయ పార్టీలకుందని.. దీంతో మోదీపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీల మద్దతు కూడా లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కేంద్రం ప్రభు

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (12:38 IST)
తెలుగు ప్రజలకు అన్యాయం చేశామనే సానుభూతి దేశంలోని రాజకీయ పార్టీలకుందని.. దీంతో మోదీపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీల మద్దతు కూడా లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కేంద్రం ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ స్పష్టం చేసారు. 
 
ప్రధానిపై, బీజేపీపై ఎప్పుడు గుర్రుగా వుండే ఓవైసీ అవిశ్వాసానికి సై అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందేనని ఓవైసీ తెలిపారు. ముస్లిం మహిళలకు, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, యవతకు ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని ఓవైసీ తెలిపారు. దీంతో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
 
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దక్షిణాది పట్ల బీజేపీ ఉత్తరాది నేతలు చులకన భావాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి వ్యాఖ్యలే నిదర్శనం.

పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో, ఏ పార్టీ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూద్దాం. ఏదైనా ఇది ఎన్నికల ఏడాది అని.. ఈ సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్లు వస్తుంటాయన్నారు. దీనిని బట్టి ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా పరోక్షంగా ఎన్నికల ముందు డిమాండ్ల గాటలో నక్వి కట్టేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments