కూలిన మరో మిగ్ 21 బైసన్ జెట్..

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (17:05 IST)
రాజస్థాన్‌లో ఇవాళ ఫైటర్ జెట్ మిగ్ 21 బైసన్ కుప్పకూలింది. ఈ యుద్ధ విమానం బికనీర్ సమీపంలోని నాల్ వద్ద కూలినట్లు తెలుస్తోంది. కాగా మిగ్‌లో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గతవారం భారత్‌పై పాకిస్థాన్ దాడులకు దిగడంతో మిగ్ 21 బైసన్‌లో ప్రయాణించిన భారత్ పైలట్ సైతం యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది కూలడంతో పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. 
 
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు విదితమే. ఈ రోజు కూడా మిగ్ కూలిన ఘటన పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన మిగ్ 21 బైసన్‌ను ఏదో ఢీకొట్టినట్లు కొందరు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే పక్షి మిగ్‌ని ఢీకొని ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. ఏమైనా కాలం చెల్లిన యుద్ధ విమానాలు భారత్‌కు తెల్ల ఏనుగులుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments