Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి జయప్రదకు జైలుశిక్షను ఖరారు చేసిన మద్రాస్ హైకోర్టు

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (13:46 IST)
సినీ నటి జయప్రదకు మద్రాసు హైకోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. సినిమా థియేటర్ సిబ్బంది నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తానికి వడ్డీ చెల్లించని కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆమె కోరికను తిరస్కరించి, జైలుశిక్షను ఖరారు చేసింది. 
 
పైగా 15 రోజుల్లో ఆమె లొంగిపోవాలని సూచన చేసింది. అదేసమయంలో కింది కోర్టులో ఆమె స్వయంగా హాజరై రూ.20 లక్షలు డిపాజిట్ చేసి బెయిల్ పొందవచ్చన్న సండలింపు ఇచ్చింది. అంతేకాకుండా, రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు జైలుశిక్ష రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 
 
కాగా, జయప్రదకు చెన్నైలోని రాయపేటలో జయప్రద, రాజ్ అనే రెండు థియేటర్లు ఉండేవి. వీటిని ఆమె సోదరులు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ థియేటర్లలో పని చేసే సిబ్బంది నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తానికి థియేటర్ యాజమాన్యం వడ్డీని పీఎఫ్ కార్యాలయంలో జమ చేయలేదు. ఇదేవిషయంపై సిబ్బంది కోర్టును ఆశ్రయించగా, జయప్రదకు షాక్ ఇచ్చింది. దీంతో ఆమెకు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. కాగా, ప్రస్తుతం ఆ రెండు సినిమా థియేటర్లు మూసివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments