Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన మరో కేంద్ర మంత్రి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (09:03 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన్ను కలిసినవారిలో కేంద్రం మంత్రి బాబులు సుప్రియో కూడా ఉన్నారు. దీంతో ఆయన కీలక ప్రకటన చేశారు. అమితాషాను శనివారం సాయంత్రం తాను కలిశానని, ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బాబుల్ ట్వీట్ చేశారు. 
 
టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేవరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉండనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోనున్నట్లు ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, అమిత్‌షాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఈయన గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అమిత్‌షాకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మేదాంత ఆసుపత్రికి చేరుకుని చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments