Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటేల్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి.. 93 ఏళ్ల ముసలాయన

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (11:41 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఆవిష్కరణ బుధవారం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ .. అంటే ఐక్యతా విగ్రహాన్ని అక్టోబరు 31వతేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే రికార్డుకెక్కనున్న అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మాత్రం 93 యేళ్ళ ముదుసలి కావడం గమనార్హం. 
 
ఆయన పేరు మహారాష్ట్రకి చెందిన రామ్‍ వన్జీ సుతార్‍. అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తు ఉన్న ఆ ముసలాయన ఇప్పటికి కొన్ని వేల విగ్రహాలను తయారు చేశారు. అంతేకాకుండా అరేబియన్‍ సముద్రం మధ్య భాగంలో పెట్టే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం. 
 
జవహర్‍ లాల్‍ నెహ్రూ, ఇందిరాగాంధీ, భగత్‍ సింగ్‍ లాంటి అనేక మంది ప్రముఖుల విగ్రహాలను ఆయన రూపొందించారు. అందరి కంటే గాంధీజీ విగ్రహాలు ఎక్కువగా తయారుచేశారు. పరమవీర చక్ర పొందిన వారి విగ్రహాలను కూడా ఆయన తయారు చేస్తున్నారు. వాటిని ఇండియా గేట్‍ వద్ద నేషనల్‍ వార్‍ మెమోరియల్‍‌లో ఉంచనున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments