Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలవిక్రేత!

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:55 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త నేతను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన ఎవరో కాదు. ఓ పాల వ్యాపారి. పైగా, కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 17 యేళ్ల వయసులో కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగారు. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇపుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే అంటే తన బాల్యంలో పాలు అమ్మి కుటుంబ పోషణలో తన వంతు పాత్ర పోషించారు. ఆయనే ఇపుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పేరు సుఖ్వీందర్ సింగ్ సుఖు. 
 
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సుఖ్వీందర్ సింగ్ తండ్రి ప్రభుత్వ రవాణా సంస్థలో డ్రైవరుగా పనిచేశారు. ఈయన చదువుకునే రోజుల్లో పాలు అమ్మారు. ఛోటా షిమ్లాలో ఓ పాల బూత్‌ను కూడా నిర్వహించారు. 
 
1964 మార్చి 27వ తేదీన జన్మించిన సుఖ్వీందర్ సింగ్... హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి ఏంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంస్థలో చురుకుగా పని చేశారు. షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌గా కూడా పని చేశారు. అలాగే అంచలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.
 
గత 2003లో హమిర్‌పూర్‌లోని నాదౌన్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇటీవలి ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 వరకు హెచ్.పి.సి.సి చీఫ్‌గా ఉన్నారు. 
 
ప్రస్తుతం ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సుఖ్వీందర్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింద. దీంతో ఓ పాల వ్యాపారి ఇపుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments