Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం కోరిన మధ్యవర్తులు.. అయోధ్య కేసు మళ్లీ వాయిదా!

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (12:50 IST)
వివాదాస్పద రామజన్మభూమి స్థల కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ స్థల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ మరికొంత సమయం కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేసింది. 
 
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశీ రవిశంకర్‌, సీనియర్ లాయర్ శ్రీరాం పంచు సభ్యలుగా సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని అపెక్స్ కోర్టు ఆదేశించింది. ఈ కమిటికీ అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరింది. 
 
రామజన్మభూమి - బాబ్రీమసీదు స్ధలంలో వివాదాస్పదమైన 2.77 ఎకరాలను నిర్మోహి అఖారా, సున్ని సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు (యూపీ), రామ్‌లల్లా విరాజ్‌మన్‌ల మధ్య పంచాలని అలహాబాద్‌ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
ఈ పిటిషన్లతో  పాటు అయోధ్యలో సేకరించిన వివాదాస్పదం కాని 67.703 ఎకరాల మిగులు భూమిని వాటి యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది.
 
అపుడుమధ్యవర్తుల కమిటీ తరపున హాజరైన న్యాయవాది నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వాయిదా వేసింది. పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కమిటీ కోరిందని, ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఆగస్టు 15వ తేదీన చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

రాజమౌళి స్పందన గురించి గేమ్ చేంజ‌ర్‌ చిత్ర యూనిట్ ఆసక్తి

నాని సినిమా హిట్ 3 కాశ్మీర్ లో షూటింగ్ - సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ మ్రుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం