Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్రాక్‌ వ్యూ' యాప్‌ ఇన్‌స్టాల్ చేశాడు.. కోర్కెతీర్చమని వేధింపులు.. ఎలా?

టెక్నాలజీ మనిషి ఎదుగుదలకు మాత్రమే కాదు.. వినాశనానికి కూడా దారితీస్తుంది. తాజాగా ఓ యువకుడు అందుబాటులోకి వచ్చిన ట్రాక్ వ్యూ అనే యాప్ టెక్నాలజీతో యువతుల అర్థనగ్న ఫోటోలు తీసి.. కోర్కె తీర్చమని వేధించి చివ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (09:03 IST)
టెక్నాలజీ మనిషి ఎదుగుదలకు మాత్రమే కాదు.. వినాశనానికి కూడా దారితీస్తుంది. తాజాగా ఓ యువకుడు అందుబాటులోకి వచ్చిన ట్రాక్ వ్యూ అనే యాప్ టెక్నాలజీతో యువతుల అర్థనగ్న ఫోటోలు తీసి.. కోర్కె తీర్చమని వేధించి చివరకు జైలుపాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు. ఫోన్‌కాల్‌ చేయాలని వారి ఫోన్‌ అడిగి తీసుకుని 'ట్రాక్‌ వ్యూ' అనే రహస్య యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేవాడు. ఆ తర్వాత ఆఫోన్‌ను తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు. 
 
దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్థనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్‌ ఫోన్‌లోకి చేరేవి. ఈ ఫోటోలను చూపించి తన కోర్కె తీర్చాలంటూ బెదిరించసాగాడు. ఇలా చాలా మంది అమ్మాయిలనేకాకుండా మహిళను కూడా బెదిరించి తన శరీరవాంఛ తీర్చుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ యువతికి  దినేశ్‌ ఫోన్‌చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్‌ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు. వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్‌ను చావబాది పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments