Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులలో చూసుకుంటారు... రోజా(Video)

తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామి వారి కైంకర్యాలలో నిమగ్నం అయ్యే అర్చక

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (19:28 IST)
తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామి వారి కైంకర్యాలలో నిమగ్నం అయ్యే అర్చక స్వాములకు రిటైర్మెంట్ ఎలా చేస్తారు అని టీటీడీ పాలకమండలి రోజా ప్రశ్నిచారు. 
 
సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులలో చూసుకుంటారనీ, అలాంటి రణమదీక్షితులను విధుల నుంచి తొలగించిన విధానం చాలా బాధాకరం అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనాన్ని రద్దుకు ఆమోదం తెలిపిన పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వనికి రోజా సూచించారు. శ్రీవారి ఆభరణాల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని జేఈవో వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆభరణాలను ఆన్లైన్‌లో పెడతాం అన్నారు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయినా ఆభరణాల ఆన్లైన్ పైన జేఈవో స్పందించక పోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తుందని రోజా విమర్శించారు.
 
గిరిజన శాఖ మంత్రి లేకపోవడంతోనే దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రజలపై చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని రోజా మండిపడ్డారు. ఈ రోజు స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, కోన రఘుపతి, సురేష్... ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చూడండి ఎమ్మెల్యే రోజా మాటల్లోనే... వీడియో...

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments