Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు.. పాఠ్యపుస్తకాలు ముద్రణ పూర్తి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (09:13 IST)
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‍గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను కూడా హిందీలో ముద్రించారు. ఈ నెల 16వ తేదీన ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. గత యేడాది నుంచి బీటెక్ కోర్సును కూడా ప్రాంతీయ భాషల్లో పలు కాలేజీలు బోధిస్తున్నాయి. 
 
ఇప్పటికే హిందీ భాషలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను ముద్రించగా, వీటిని ఈ నెల 16వ తేదీన భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కాలేజీల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాల్సివుంది. ఈ సీట్లు హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, గత యేడాది బీటెక్ కోర్సును ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కాలేజీతో పాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ముందుకొచ్చారు. ఈ సారి ఆ సంఖ్య 20కి చేరే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments