Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ కట్టడి- లాక్ డౌన్‌ను స్వాగతిస్తున్నాం.. మాయావతి

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:30 IST)
ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే... ఆ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ''నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది'' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
ఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు.
 
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో కొవిడ్‌ -19 మహమ్మారి విజృంభిస్తోంది. 12 గంటల్లోనే కొత్తగా మరో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1666కు చేరింది. శనివారం నిర్ధారణ అయిన 92 కేసుల్లో ఒక్క ముంబై మహా నగరంలోనే 72 కేసులు నమోదుకావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments