Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో పండిట్ హత్య.. భారీ నిరసనలు.. భద్రత కల్పించాలంటూ వినతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:40 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బద్గామ్ జిల్లాలో ఓ కశ్మీర్ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఈ పండిట్ మృత్యువాతపడ్డారు. ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా, హత్యకు గురైన పండిట్‌ను రాహుల్ భట్‌గా గుర్తించారు. ఈ కాశ్మీరీ పండిట్‌కు గత 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఉద్యోగం చేసుతుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ భట్‌ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో తరచుగా కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments