Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అగ్నిప్రమాదం - నలుగురి మృతి

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:36 IST)
ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్‌ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 
 
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంపై అంతస్తులో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ నాలుగు ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత నలుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే, నలుగురు భారీ పొగకారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటారని అధికారులు పేర్కొన్నారు. 
 
మృతుల్లో శాస్త్రిభవన్‌లో ప్యూన్‌గా చేస్తున్న 59 వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, ప్యూన్‌తో పాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments